సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే అమరావతి ఐ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. లండన్ ఐ తరహాలోనే అమరావతిలో కృష్ణా నదీతీరంలో అమరావతి ఐ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు భవన బాహ్య సుందరీకరణ కోసం రూ. 547 కోట్లు, ఐఏఎస్ అధికారుల నివాసాల్లో ఆధునిక సౌకర్యాల కోసం రూ. 94.90 కోట్లు మంజూరు చేశారు.