పంజాబ్‌లోని ఐదు ప్రముఖ దేవాలయాలకు గురువారం వచ్చిన ఒక బాంబు బెదిరింపు ఈమెయిల్ తీవ్ర కలకలం రేపింది. ఈ మెయిల్‌తో అప్రమత్తమైన భద్రతా దళాలు రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించాయి. 1984 జూన్‌లో స్వర్ణ దేవాలయం నుండి ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ వార్షికోత్సవానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ బెదిరింపు రావడం గమనార్హం. ఈ ఈమెయిల్‌లో ఆనాటి వివాదాస్పద సైనిక చర్యకు సంబంధించిన అత్యంత రెచ్చగొట్టే అంశాలను ప్రస్తావించినట్లు అధికారులు వెల్లడించారు.