ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని డెన్మార్క్ స్వయంప్రతిపత్తి ప్రాంతమైన ‘ఫారో దీవుల్లో’ అనాగరిక ఘోరం వెలుగుచూసింది. శతాబ్దాల నాటి వైకింగ్ కాలం నాటి క్రూరమైన సాంప్రదాయం పేరిట దాదాపు 706 డాల్ఫిన్లు, పైలట్ తిమింగలాలను అత్యంత దారుణంగా వేటాడి చంపేశారు. స్థానికంగా ‘గ్రిందాడ్రాప్’ లేదా ‘గ్రిండ్’ అని పిలిచే ఈ వార్షిక వేట సాగర తీరాన్ని రక్తాసిక్తం చేసింది టోర్షావన్ తీరంలో 402 పైలట్ తిమింగలాలు, నాలుగు బాటిల్‌నోస్ డాల్ఫిన్‌లు చంపబడగా..
స్కాలబోట్‌నూర్‌లో 168, హ్వాల్విక్‌లో 132 తెల్లటి డాల్ఫిన్‌లను వేటగాళ్లు బలితీసుకున్నారు.