అమీర్‌పేట్ అగ్నిప్రమాదం జరిగిన సంఘటనలో మంటలను అదుపులోకి తేవడంలో రోబో కీలక పాత్ర పోషించింది. రోబో పేరు రైనో ప్రొటెక్ట్. ఫైర్ ఫైటర్స్ వెళ్లలేని చిన్ని చిన్న సంధుల్లోకి ఈ రోబో వెళ్లడంతో పాటు తనకు అమర్చిన ఒక పైపు ద్వారా నీళ్లను చల్లడంతో మంటలను అదుపులోకి తెచ్చింది. రిమోట్‌తో ఈ రోబోను ఆపరేట్ చేయొచ్చు. దీనికి అమర్చిన కెమెరాతో ముందు ఏం జరుగుతుందో ఆపరేటర్ తెలుసుకుంటాడు. దానికి తగ్గట్లు వాటర్‌ను విడుదల చేస్తూ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.