రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28, 456 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొదటి రెండు రోజుల్లో కేవలం 9, 276 నామినేషన్లు మాత్రమే రాగా , చివరి రోజు ఒక్క రోజే ఏకంగా 19180 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 2020లో గల్వాన్ లోయలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుడు కల్నల్ సంతోష్ బాబు మాతృమూర్తి మంజుల సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల బరిలో దిగారు. బీఆర్‌ఎస్ తరఫున 44 వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

