రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తన మరణాన్ని కోరుకున్నారని బిజెపి మద్దతుదారులపై మాజీ సిఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. “ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున, బీజేపీకి చెందిన అరాచకవాదులు నాకు గుండెపోటు వచ్చి చనిపోవాలని కోరుకున్నారు. కానీ మీ అంతం చూసేంత వరకు నేను బతికే ఉంటాను” అని బెనర్జీ అన్నారు. తన వయసును ప్రస్తావిస్తూ తనను లక్ష్యంగా చేసుకోవడాన్ని కూడా ఆమె ఖండించారు. ఎవరైతే వెళ్లిపోవాలనుకుంటున్నారో, దయచేసి వెళ్లిపోండి. 2006లో నేను పార్టీని ఎలాగైతే పునరుద్ధరించగలిగానో, 2026లో కూడా అలాగే చేయగలను” అని ఆమె పేర్కొన్నారు.