ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ సంపద ఒక్కరోజులోనే అమాంతం పెరిగింది. సోమవారం జరిగిన ట్రేడింగ్లో ఆయన 25 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 2.39 లక్షల కోట్లకు పైగా) ఆర్జించారు. ఈ భారీ లాభానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మెటా ప్రకటించిన కొత్త ప్రణాళికలు. ఈ ప్రణాళికలతో కంపెనీ షేర్లు దాదాపు 12 శాతం పెరిగాయి. ఫోర్బ్స్ అంచనా ప్రకారం, ఈ పెరుగుదలతో జుకర్బర్గ్ సంపద మొత్తం 253.6 బిలియన్ డాలర్లకు చేరింది.