నీట్ పరీక్షా పేపర్ లీక్ కావడంతో మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తుందనే ఒత్తిడితో మధ్యప్రదేశ్‌కి చెందిన ఆకాంక్ష అనే 18 ఏళ్ల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆకాంక్ష తండ్రి ఒక రైతు. తన కూతురు అక్కడ కోచింగ్‌కు వెళ్లడం కోసం నాగ్‌పూర్‌లో వంటవాడిగా కూడా పనిచేశారు. ఆకాంక్ష మరణం ఆత్మహత్య కాదు, అది మోదీజీ హయాంలోని అవినీతిమయమైన, విచ్ఛిన్నమైన వ్యవస్థ పర్యవసానం. భారతదేశంలోని యువతరం మొత్తం దాని మూల్యం చెల్లిస్తోంది.’ అని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.