సింగరేణిలో జరుగుతున్న వరుస కుంభకోణాలను బయటకి రాకుండా చేసేందుకు తమ పార్టీ నేత బాల్క సుమన్ మీద ఇష్టమొచ్చిన సెక్షన్లు పెట్టి జైల్లో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ మీద ప్రభుత్వానికి ఎందుకంత కోపమని.. ఉద్యమంలో బాల్క సుమన్పై 220 కేసులు పెట్టారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.. ఇప్పుడు ఆ రికార్డులు బద్దలు కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తగలబెట్టాలని మాట్లాడితే చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు ఒక నీతి, బాల్క సుమన్ కు ఒక నీతి ఉంటుందా? అని నిలదీశారు.