హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సూడాన్ దేశం నుండి వచ్చిన మొహమ్మద్ అనే ప్రయాణికుడిలో ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు గుర్తించారు. విమానాశ్రయంలోని ప్రత్యేక హెల్త్ స్కానర్ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిపై అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్య బృందాలు, విమానాశ్రయ అధికారులు అతడిని ప్రత్యేక అంబులెన్స్ లో సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించి, ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.