మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో, సినిమా ఘన విజయం సాధించాలనే గట్టి సంకల్పంతో హీరోయిన్ జాన్వీ కపూర్ కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు. సాంప్రదాయ పద్ధతిలో అలిపిరి మెట్ల మార్గం గుండా ఆమె కాలినడకన కొండపైకి చేరుకోవడం విశేషం.