తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానానికి అండగా నిలిచిన మిడ్జిల్ గడ్డపై శనివారం భావోద్వేగ ప్రసంగం చేశారు. నాది ఈ నియోజకవర్గం కాకపోయినా కేవలం నమ్మకంతో గెలిపించారు. ఆరోజు మిడ్జిల్ ప్రజలు నాటిన చిన్న మొక్కే.. ఇవాళ మీ దయవల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి అనే మహా వృక్షమైంది అంటూ కృతజ్ఞతలు చాటుకున్నారు. మళ్లీ వారి దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్ సభ ముఖంగా పిలుపునిచ్చారు.