ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చి దిద్దుతామని ప్రకటించారు. అదే విధంగా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పం సమగ్ర అభివృద్ధి కోసం సుర్బానా జురాంగ్, ఐఐటీ కాన్పూర్ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని సీఎం చెప్పారు. కుప్పానికి వచ్చే ప్రతి ఒక్కరికీ కొత్త అనుభూతి కలిగేలా ఎలిఫెంట్ సఫారీ, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.