మీ భూమి మీదేనని.. దానిపై హక్కు మీదేనని, అదే కూటమి ప్రభుత్వం మార్క్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ప్రకాశం జిల్లాలోని పాలేరు నదిపై వంతెన నిర్మాణానికి, పాలేరు రిజర్వాయర్ స్పిల్వే, .ప్రధాన తూముల నిర్మాణపనులకు ముఖ్యమంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. నర్సింగోలులో ‘మీ భూమి-మీ హక్కు’ గ్రామ సభలో పాల్గొని కొందరు లబ్దిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు పెండింగ్లో ఉన్న రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు.