తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ శుక్రవారం కూడా స్వామివారి భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వీకెండ్ కావడంతో భక్తుల తాకిడి క్రమంగా పెరుగుతుండటంతో టీటీడీ అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తుల రద్దీ కారణంగా వేచి ఉండే కంపార్ట్మెంట్లు నిండిపోయి, దాదాపు 16 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.