పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్‌ఎల్‌ఎలలో 65 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని స్వయంగా ప్రకటించుకున్నారు.గెలిచిన 292 మంది అభ్యర్థుల్లో 190 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
ఈమేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ నివేదిక వెల్లడించింది. 14 మంది ఎమ్‌ఎల్‌ఎలపై హత్య కేసులు, 54 మందిపై హత్యాయత్నం కేసులు,63 మంది విజేతలు మహిళలకు సంబంధించిన కేసులను ప్రకటించారు.బీజేపీ అభ్యర్థుల్లో 74 శాతం మందిపై ,TMC ఎమ్‌ఎల్‌ఎల్లో 43 శాతం క్రిమినల్ కేసులు ఉన్నాయి