సినిమా షూట్ లో ఊహించని విధంగా బాలయ్య గాయానికి లోనైన సంగతి తెలిసిందే. ఏ ఐ జి హాస్పిటల్స్ వారు విజయవంతంగా బాలయ్యకి సర్జరీ ముగించినట్టుగా గుడ్ న్యూస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, స్వయానా బాలయ్యకి బావ అయినటువంటి చంద్రబాబు నాయుడు బాలయ్యని ఏ ఐ జి ఆసుపత్రిలో కలవడం ఇప్పుడు వైరల్ గా మారింది. బాలయ్య క్యాప్ పెట్టుకొని మంచి
ఎనర్జిటిక్ గా కనిపిస్తూ బాలయ్య, చంద్రబాబుతో కలిసి మాట్లాడుతున్న ఫోటో బయటకి వచ్చి ఫ్యాన్స్ లో జోష్ నింపింది