టిడిపి ముఖ్యనేతలతో సిఎం టెలికాన్ఫరెన్స్ జరిపారు. వైసిపి నేతలతో వేదికలు పంచుకోవడంపై పరోక్షంగా ప్రస్తావించారు. వైసిపి నేతలతో ఎట్టి పరిస్థితుల్లో వేదికలు పంచుకోవాల్సి వద్దని ఆదేశించారు. గొడ్డలి పార్టీ ట్రాప్ లో నేతలెవరూ పడొద్దు అని సూచించారు. రెండేళ్ల పాలనపై చేపట్టాల్సిన ఇంటింటి ప్రచారం.. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేయాలని ప్రజలు, కార్యకర్తలతో సన్నిహితంగా ఉండాలని కోరారు. తనకు కావాల్సింది అనుచరులు కాదు.. పార్టీకి నాయకులు అని చంద్రబాబు పేర్కొన్నారు.