సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు సోదరుడు రమేష్‌బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రత్యేక వీడియో విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తన సోదరుడు రమేష్‌బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయం కావడం తమ కుటుంబానికి ఎంతో ఆనందంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులంతా ఈ సినిమాపై ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు.
ఇప్పటివరకు చూసిన టీజర్, పాటలు, ట్రైలర్ చాలా బాగా ఉన్నాయని మహేశ్‌బాబు ప్రశంసించారు.