ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించడానికి చర్చలు మాత్రమే సరైన మార్గమని సామాజిక కార్యకర్త అన్నాహజారే పేర్కొన్నారు. ఉద్రిక్తతలు సృష్టించడంతో, నియంతృత్వ ధోరణితో ఏమీ సాధించలేమని అన్నారు. ఇప్పటివరకు తాను 22 సార్లు నిరాహార దీక్ష చేశానని, ఎన్నడూ హింసను ఆశ్రయించలేదని అన్నారు. శాంతియుత ఆందోళనలే శాసనపరమైన మార్పులు తీసుకురావడానికి దోహదపడ్డాయన్నారు. తాను చేపట్టిన శాంతియుత నిరసనల కారణంగా 10 చట్టాలు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వాలు పౌరుల మాట వినాలని, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని హజారే సూచించారు.