అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు బోల్తా పడిన విషయం తెలిసిందే. కాగా బస్సు ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కండ్లకు కట్టినట్టుగా కనిపించింది. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను కాలం చెల్లిన, తుప్పు పట్టిన స్ట్రెచర్‌పై క్షతగాత్రుల తరలించారు. సిబ్బంది నిర్లక్ష్యంతో క్షతగాత్రులు స్ట్రెచర్‌పై నుంచి కిందపడిపోయారు. క్షతగాత్రులు వీల్చైర్లు లేకపోవడంతో చేసేదేమి లేక తీవ్ర గాయాలతో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతున్నాయి.