జపాన్ షట్లర్ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. పీవీ సింధు వెనక్కి తగ్గలేదు. రెండో గేమ్ కోల్పోయినా పుంజుకుంది. నిర్ణయాత్మక గేమ్ లో దూకుడు పెంచి ఫ్రెంచ్ ఓపెన్ 2026 ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి హినా అకేచీని 21-10, 20-22, వరుసగా ఆరు పాయింట్లు సాధించి 21-16తో గేమ్ ముగించింది. దీంతో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఫైనల్లో దక్షిణ కొరియాకు ప్రపంచ నంబర్ వన్ ఆన్ సె యంగ్ తో తలపడనుంది.