రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో గతంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. 2023లో తన ఫోన్, భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. పంజాగుట్ట పిఎస్ నుంచి సిద్ధిపేట వన్‌టౌన్‌కు బదిలీ అయిన ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పంజాగుట్టలో నమోదైన ఎఫ్ఐఆర్కు అదనపు సెక్షన్లు జోడించారు.