ఉత్తరప్రదేశ్కు చెందిన ఇంగ్లీష్ టీచర్ యశోదా లోధీ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ప్రముఖ నటి ప్రియాంక చోప్రా జోనస్ ఆమె రూపొందించిన ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో యశోదాకు మరింత గుర్తింపు లభించింది. యశోదా “ఇంగ్లీష్ విత్ దేహతి మేడమ్” పేరుతో సోషల్ మీడియా ఖాతాను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సులభంగా ఇంగ్లీష్ నేర్చుకునేలా సాధారణ పదాలు, వాక్యాలను వివరిస్తూ ఆమె వీడియోలు రూపొందిస్తున్నారు.కంటెంట్కు మంచి ఆదరణ లభిస్తోంది.