ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ డిమాండ్ చేశారు. దేశానికి ఆయన చేసిన అంకితభావం, నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించారు. నెహ్రూ, ఇందిరా గాంధీలకు భారతరత్న ఇచ్చినప్పుడు, గత 25 ఏళ్లుగా ప్రజాసేవకు అంకితమైన మోదీకి కూడా ఇవ్వాలని కోరారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సాహ్నీ ఈ వ్యాఖ్యలు చేశారు.