ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ లక్ష్యంగా సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు చేశారు. సమాజంలో మార్పు కోరుకునేందుకు ప్రజల వద్ద ఉన్న ఏకైక ఆయుధం ఓటు.. ఆ ఓటును దొంగిలించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జ్ఞానేశ్ నిజమైన దేశ ద్రోహి అని సంచలన ఆరోపణలు చేశారు. జ్ఞానేశ్ కుమార్ ఇక చాలు బ్రదర్ అంటూ ఎక్స్ మాధ్యమంలో పోస్టు పెట్టారు. తక్షణమే ఈ సమస్యకు చెక్ పెట్టకపోతే మనం భారత్ ను మార్చలేమని స్పష్టం చేశారు.

