ఢిల్లీ పెల్లెట్ గన్ కేసులో ఎట్టకేలకు పోలీసులు FIR నమోదు చేశారు. తొలుత ‘కుదరదు’ అని చెప్పిన పోలీసులు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధితుడితో కలిసి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడంతో మరో దారిలేక.. ఎఫ్ఐఆర్‌కు సరేనన్నారు. పెల్లెట్ గన్ బాధితుడు సాహిల్ లొచాబ్ ఫిర్యాదు అనంతర అతడి నుంచి దవాఖాన నివేదికలు, ఇతర కాగితాలను తీసుకొని కేసు నమోదు చేశారు. ఛలో పార్లమెంట్’ సందర్భంగా పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించడంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.