కడప జిల్లా పులివెందుల పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, వెనక్కి తగ్గలేదు. దీంతో గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరపడం కలకలం రేపింది. నామినేషన్ వేసేందుకు వస్తుంటే టీడీపీ నేతలు తమను బలవంతంగా అడ్డుకున్నట్లు వైసీపీ అభ్యర్థులు ఆరోపించారు. ఇరు వర్గాల మధ్య మాటామాట పెరగడంతో ఒకరినొకరు దాడి చేసుకునే వరకు వెళ్లారు.