ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కేవీపీ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ విషయంలో పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ మీపై కేసులు పెట్టమన్నారని నిరూపించగలరా? అంటూ పవన్ కల్యాణ్ కు కేవీపీ బహిరంగ లేఖ రాశారు. “వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు మీపై ఎలాంటి కేసులు పెట్టలేదు. వైఎస్సారే కేసులు పెట్టమన్నారన్న పోలీస్ అధికారికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి. నిరూపిస్తే వైఎస్సార్ అభిమానులందరం కలిసి సీఎంఆర్ఎఫ్ కు రూ.10 కోట్లు ఇస్తాం” అని కేవీపీ సవాల్ విసిరారు.