ఒక పబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పబ్ యజమానితో సహా ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలోని మైసూర్‌లో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఒక రెస్టో పబ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. డార్జిలింగ్‌కు చెందిన 26 ఏళ్ల సాహిన్, నేపాల్‌కు చెందిన 24 ఏళ్ల ప్రకాష్‌గా మృతులను గుర్తించారు.