స్థానిక ఎన్నికల్లో కూటమికి 58.90 శాతం ఓట్లు వచ్చాయి. వైకాపాకు 33.56 శాతం ఓట్లు వచ్చాయి. 2024 ఎన్నికలతో పోల్చితే.. వైకాపా ఓట్లు 6.25 శాతం తగ్గాయి. స్థానిక ఎన్నికల్లో కూటమి మెజారిటీ దాదాపు 25.34 శాతం వరకు ఉంది. పట్టణాల్లో 59.9 శాతం కూటమికి వచ్చాయి.జడ్పీటీసీల్లో కూటమి స్ట్రయిక్ రేట్ 87.5% ఎంపీటీసీల్లో 90 శాతానికిపైగా కూటమి గెలుచుకుంది. రెండున్నరేళ్ల పాలన తర్వాత ప్రజా స్పందనకు ఇదో ఉదాహరణ. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా కూటమికి ప్రజలు నీరాజనం పలికారు” అని చంద్రబాబు వివరించారు.