ఐపిఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడో విజయాన్ని అందుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్, పంజాబ్ పట్టుపై 33 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన
236 పరుగుల లక్ష్య ఛేదనలో కాన్లీ(107 నాటౌట్) శతకంతో చెలరేగినా.. పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిగత బ్యాటర్లు విఫలమవ్వడంతో కాన్లీ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్, శివాంగ్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ మలింగ, హుస్సేన్ లు తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.