ప్రజాపాలనలోనే కాకుండా న్యాయవ్యవస్థలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు ప్రకటించారు. తాటి ఆకులపై తీర్పులు రాసే కాలం నుంచి నేటి ఆధునిక ఏఐ సాంకేతికత వరకు న్యాయవ్యవస్థ ఎంతో రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. ఇప్పటికే పన్నుల వసూళ్లలో ఏఐ ద్వారా అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని, అదే స్ఫూర్తితో న్యాయపాలన మరియు వ్యాజ్యాల నిర్వహణ కోసం త్వరలోనే ‘లీగల్ ఏఐ స్టాక్’ను అమల్లోకి తీసుకువస్తామని వెల్లడించారు.

