నార్సింగి పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పసిఫికా హిల్క్రెస్ట్ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు గురైయ్యారు. హై రైజ్ బిల్డింగ్లో 12వ ఫ్లోర్ నుంచి 18వ ఫ్లోర్ వరకు వేగంగా మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి ఫాల్ సీలింగ్ పూర్తిగా కాలిపోయి అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అపార్ట్మెంట్లో నివాసితులు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.