జాతీయ సైబర్ భద్రతా మాసోత్సవ ప్రత్యేక ప్రచారం 6.0లో భాగంగా, ఎవరైనా పొరపాటున డబ్బు మీ అకౌంట్కు బదిలీ అయ్యిందని, దానిని తిరిగి ట్రాన్స్ఫర్ చేయాలని అడిగినట్లయితే అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ వినియోగదారులను కోరింది. మోసగాళ్లు తాము పొరపాటున బాధితుల ఖాతాకు చిన్న, పెద్ద మొత్తాన్ని జమ చేశామని చెబుతారు. దాని ఆధారంగా వారు వెంటనే ఆ డబ్బును వాపసు ఇవ్వమని కోరతారు. ధృవీకరణ లేని అత్యవసర యూపీఐ అభ్యర్థనల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ వినియోగదారులను హెచ్చరించింది.