పశ్చిమ గోదావరి జిల్లా లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు జనసేన పార్టీలో చేరారు. శ్రీరామ్ తల్లి ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గంలో సర్పంచ్‌గా పోటీచేయనున్నారు. అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి, ఉమారాణి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అనంత శ్రీరామ్ తల్లి ఉమారాణి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

