ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా సీఐడీ కోర్టుకు కుక్కల విద్యాసాగర్ ఈరోజు(బుధవారం) హాజరయ్యారు. ఈ కేసులో జత్వానీ సోదరుడు, తల్లిదండ్రులు పేర్లు తొలగించటంపై లిఖిత పూర్వకంగా తన అభ్యంతరాలను సీఐడీ కోర్టుకు విద్యాసాగర్ అందజేశారు. కొంత డబ్బును జత్వానీ తల్లి ఆశా జత్వానీ అకౌంట్‌కు బదిలీ చేశానని తెలిపారు. కొన్నిసార్లు జత్వానీ తల్లి ఫోన్ చేసి తన కుమార్తె చెప్పినట్లుగా చేయాలని లేకపోతే ఇబ్బంది పడతావని బెదిరించిందని అన్నారు