రాష్ట్రంలో నెలకున్న భూ సమస్యలు, 22ఏ నిబంధనలు , ధరణి అక్రమాలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం, వాళ్ల బంధువులు మాత్రమే బాగుపడ్డారని అన్నారు. అలాగే ధరణి తప్పిదాలతో వందల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని, తెలంగాణలోని దాదాపు 2.49 కోట్ల ఎకరాల భూమిని తమ సొంత ఆస్తిగా భావించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించిందని మంత్రి మండిపడ్డారు. ధరణి పోర్టల్ నిర్వహణను దివాలా తీసిన ఒక విదేశీ కంపెనీకి అప్పగించారని దుయ్యబట్టారు.