తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? అంటూ మండిపడ్డారు. “స్వయంగా కెసిఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు” అని కెటిఆర్ అన్నారు.

