తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొస్తామంటున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు బహిరంగ సవాల్ విసిరారు. గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చి నిరూపిస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని, లేదంటే మంత్రి ఉత్తమ్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు పట్టిసీమ మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తే, కాంగ్రెస్ దేవాదుల మోటార్లను ఎందుకు నడపలేకపోయిందో చెప్పాలని, దీనిపై తక్షణమే వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.