పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకునేందుకు సౌదీ అరేబియా భారీ ఆర్థిక ప్రతిపాదన చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సౌదీపై దాడులను నిలిపివేస్తే హౌతీలకు 1 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.9,500 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఈ ఆర్థిక ప్రతిపాదనకు సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. సౌదీ, టర్కీ, పాకిస్థాన్ ప్రతినిధులు ఇరాన్‌లో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.