దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న NEET పరీక్షల రద్దు, పేపర్ లీకేజీ, రీ-ఎగ్జామ్ భయాల నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఒక మెడికల్ అభ్యర్థిని బలవన్మరణానికి పాల్పడింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన అవంతిక మౌర్య (21) అనే విద్యార్థిని గురువారం రాత్రి తాను ఉంటున్న భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించింది. భవనం పైనుంచి కిందపడిన అవంతిక తీవ్రంగా గాయపడటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసింది.