కొత్త తరహా ఆయుధాన్ని డీఆర్డీవో పరీక్షించింది. తారా గ్లైడ్ వెపన్ సిస్టమ బాంబును ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించారు. తారా అంటే టాక్టికల్ అడ్వాన్స్‌డ్ రేంజ్ ఆగుమెంటేషన్(టీఏఆర్ఏ). ఇదొకరమైన బాంబు. స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు. సంప్రదాయకరమైన వార్‌హెడ్స్‌తో ఈ సిస్టమ్ ద్వారా కచ్చితమైన టార్గెట్లను ధ్వంసం చేయవచ్చు. డీఆర్డీవో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించాయి. తక్కువ ఖర్చుతో ఈ బాంబును రూపొందించారు.