టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్గా ఈఓ రవిచంద్ర ప్రమాణస్వీకారం చేశారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు. సంప్రదాయబద్దంగా ధ్వజస్తంభ ప్రదక్షిణ అనంతరం ఆలయ ప్రవేశం చేసిన ఈవో దంపతులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి వద్ద ప్రత్యేక కమిటీ చైర్మన్గా ప్రమాణస్వీకారం చేసి రంగనాయక మండపంలో బాధ్యతలు చేపట్టారు. టీటీడీ ధర్మకర్తల మండలి పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేసింది.