మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో “ఆల్ ఈజ్ వెల్” అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే పరిస్థితి తలకిందులైంది. చండూరు మున్సిపాలిటీలో అధికార పార్టీలోని వర్గ విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఆత్మహత్యాయత్నం చేసిన వేణు చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సంసిద్ధం కాగా బీ-ఫామ్ దక్కకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

