జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మీడియాను అనుమతించాలంటూ వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. మేయర్ పోడియం వద్ద వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు బైఠాయించారు. గీతం భూ దోపిడీని అరికట్టాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. గీతం భూముల వ్యవహారంపై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. జీవీఎంసీ కౌన్సిల్లో మేయర్ పీలా శ్రీనివాస్ దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను మేయర్ తోసేశారు. కౌన్సిల్లో టీడీపీ కార్పొరేటర్లు బీభత్సం సృష్టించారు. 62వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ లక్ష్మణరావు కాలికి గాయమైంది.

