భారత జట్టు జింబాబ్వే పర్యటనలో తొలి విజయం అందుకుంది. గురువారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. ఈమ్యాచ్లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. 19 బంతుల్లో 50 పరుగులు చేసి, పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ సాధించిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.