క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027 ర్యాంకింగ్స్ లో IIT Delhi భారతదేశంలోనే అత్యుత్తమ ర్యాంక్ సాధించిన విద్యాసంస్థగా అవతరించింది. 2026లో ఉన్న 123వ స్థానం నుంచి 2027 నాటికి 65.7 ఓవరాల్ స్కోరుతో ప్రపంచవ్యాప్తంగా 118వ స్థానానికి చేరుకుంది. ఈ సంవత్సరం ప్రపంచంలోని టాప్ 200 విశ్వవిద్యాలయాల జాబితాలో కేవలం మూడు భారతీయ విద్యాసంస్థలు మాత్రమే చోటు దక్కించుకోగలిగాయి. ఇందులో ఐఐటీ ఢిల్లీ 118వ స్థానంలో నిలవగా, ఐఐటీ బాంబే 134వ స్థానంలో, ఐఐటీ మద్రాస్ 170వ స్థానంలో నిలిచాయి.