టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

