ఢిల్లీ నుంచి పుణె వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలోకి ఎక్కిన అనంతరం లోపల ఏసీ పని చేయలేదు. విమానంలో గాలి సరిగా లేకపోవడంతో లోపల ఉన్ 150 మంది ప్రయాణీకులు చెమటతో తడిసి ముద్దయ్యారు. విమానంలో గాలి ఆడక పరిస్థితి విషమిస్తున్నప్పటికీ.. పైలట్లు విమానాన్ని రన్‌వే వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.పరిస్థితి చేయిదాటిపోవడంతో రన్‌వేపై టేకాఫ్ ను నిలిపివేయడంతో పాటు ప్రయాణీకులను విమానం నుంచి కిందకు దింపేశారు. చివరకు సాంకేతిక బృందం వచ్చి పరీశీలించిన తర్వాత ప్రయాణీకులను తెల్లవారుజామున 5 గంటలకు పుణెకు పంపించారు.